: తిరుపతిలో మరోసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్... పాల్గొననున్న ‘నోబెల్’ గ్రహీతలు

తిరుపతిలో మరోసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. 33 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ సైన్స్ కాంగ్రెస్ కు సుమారు 9 మందికి పైగా నోబెల్ బహుమతి గ్రహీతలు పాల్గొననున్నట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన కార్యాలయంలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై తొలి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2017 జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు ఈ సైన్స్ కాంగ్రెస్ జరగనుందన్నారు. ఈ సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై వారానికొకసారి సమీక్షించనున్నట్లు సుజనా చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ, మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ సదస్సు నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయని అన్నారు. సైన్స్ కాంగ్రెస్ ద్వారా విద్యార్థులను ఉత్తేజ పర్చాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణలో ఎవరి బాధ్యతలు ఏమిటో ఈ సమావేశంలో ఓ స్పష్టతను ఇచ్చారని తెలిపారు.

More Telugu News