: ‘డంబో, జంబో, జుమ్లే’.. కుంబ్లేకు వెరైటీగా శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్

టీమిండియా చీఫ్ కోచ్ అనిల్‌ కుంబ్లే ఈ రోజు 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు సోషల్‌మీడియాలో ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. టీమిండియా మాజీ ఆట‌గాళ్లు సచిన్, గంగూలీ, సెహ్వాగ్‌ తో పాటు ప్ర‌స్తుత క్రికెటర్లు ధోనీ, కోహ్లీ, అశ్విన్, పార్థివ్ పటేల్ ఆయ‌న‌ను విష్ చేశారు. కుంబ్లేను టీమిండియా ఆటగాళ్లు ముద్దుగా 'ద జంబో' అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ కుంబ్లేను... ‘డంబో, జంబో, జుమ్లే,’ అంటూ సరదాగా సంబోధిస్తూ పోస్ట్ చేశాడు. కుంబ్లే జీవితంలో డంబోగా ఉండకూడదని ఆయన పేర్కొన్నాడు. కుంబ్లే ఎప్పటికీ జంబోగానే ఉండాలని పేర్కొన్నాడు. కుంబ్లే ప్రతి ఒక్క‌రితో వినయంగా నడుచుకునే వ్య‌క్తని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన కోచ్‌‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తోన్న కుంబ్లే 1970 అక్టోబర్ 17న బెంగళూరులో జ‌న్మించారు. ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు కూల్చి కుంబ్లే రికార్డుల‌కెక్కారు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్య‌ధిక‌ వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో మూడో స్థానంలో నిలిచారు. కుంబ్లే 132 టెస్టు మ్యాచుల్లో 619 వికెట్లు తీశాడు. ఇక వ‌న్డేల్లో 271 మ్యాచులు ఆడిన కుంబ్లే 331 వికెట్లను త‌న ఖాతాలో వేసుకున్నారు.

More Telugu News