: బాత్‌రూమ్‌లో మొసలి.. ఒక్కసారిగా చూసి షాక్!

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో జయనారాయణ్ నగర్ పరిధిలోని దబోయి రోడ్డు మార్గంలో ఉన్న ఓ ఇంట్లోకి ఓ మొస‌లి వ‌చ్చింది. సుమిత్రా పటేల్ అనే వ్య‌క్తి ఇంట్లో బాత్‌రూమ్‌లో ఈ మొసలి క‌నిపించింది. మొస‌లి అక్క‌డ ఉన్న విష‌యాన్ని పొరుగింట్లో ఉంటున్న నరేంద్ర వసవ అనే వ్య‌క్తి బ‌య‌టి నుంచి గ‌మ‌నించాడు. మొస‌లిని ఒక్కసారిగా చూసి షాక్‌కు గురయ్యాడు. తేరుకొని ఈ విష‌యాన్ని స్థానికుల‌కు, సుమిత్రా ప‌టేల్ కు ఈ విషయాన్ని చెప్పాడు. అనంత‌రం ఈ స‌మాచారాన్ని అగ్నిమాపక, విపత్తులు, అటవీ శాఖ అధికారులకు చేర‌వేశారు. జంతు ప్రేమికుల‌తో కలిసి వ‌చ్చిన‌ అటవీశాఖాధికారులు ఆ మొసలిని తీసుకొని మొసళ్ల పెంపక కేంద్రానికి త‌ర‌లించారు. విశ్వామిత్ర నదిలో తిరిగే మొసళ్లు వరదనీటిలో కొట్టుకొస్తున్నాయ‌ని అక్క‌డి వారు తెలిపారు. కాలనీకి సమీపంలో ఉన్న వరద నీటి కాల్వ ద్వారానే సుమిత్రా ప‌టేల్ బాత్‌రూమ్‌లోకి ఈ మొసలివ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఈ మొసలిని చూసేందుకు స్థానికులు బారులు తీరారు.

More Telugu News