: భారత ఉత్పత్తులకు బ్రెజిల్ లో మంచి మార్కెట్ ఉంది: ప్రధాని మోదీ

లాటిన్ అమెరికాలో భార‌త్‌కు బ్రెజిల్ ప్రధాన ఆర్థిక భాగ‌స్వామి అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయ‌న గోవాలో మాట్లాడుతూ... ఇరు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల‌పై ద్వైపాక్షిక చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌మ‌ద‌య్యాయని పేర్కొన్నారు. ఉగ్ర‌వాదంపై భార‌త్ చేస్తోన్న పోరాటానికి మ‌ద్ద‌తు ప‌లికినందుకు బ్రెజిల్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఉగ్ర‌వాదంపై పోరాడ‌డానికి ప్ర‌పంచం ముందుకు రావాల‌న్న నినాదాన్ని ఇరు దేశాలు వ్యాప్తి చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు. వ్య‌వ‌సాయ రంగంలో ప‌రిశోధ‌న‌, సైబ‌ర్ సెక్యూరిటీ, డ్రగ్స్ రెగ్యులైజేషన్ అంశాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. భాత‌ర్‌లో బ్రెజిల్ కంపెనీల పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. భారత ఉత్పత్తులకు బ్రెజిల్ లో మంచి మార్కెట్ ఉందని తెలిపారు. ఎన్ఎస్జీ గ్రూప్ లో భారత్ సభ్యత్వం పొందడానికి బ్రెజిల్ తెలుపుతున్న మద్దతు పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News