: రూ. 29 లక్షలు పలికిన ఒంగోలు జాతి గిత్తలివి!

ఒంగోలు జాతి ఎద్దులు... అటు వ్యవసాయానికి, ఇటు పునరుత్పత్తికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ జాతి ఎద్దులను తమ వ్యవసాయ పనులకు వినియోగించుకునేందుకు, వాటిని చక్కగా చూసుకుని తర్ఫీదునిచ్చి ఎడ్ల పందాల్లో పాల్గొనేందుకు రైతులు ఎంతో ఉత్సాహాన్ని చూపుతారు. వీటిని కొనుగోలు చేసేందుకు లక్షల రూపాయలు వెచ్చిస్తుంటారు. తాజాగా, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి వాసి చిలకపాటి రాజీవ్ కు చెందిన ఒంగోలు జాతి ఎద్దుల జత రూ. 29 లక్షలు పలికాయి. వీటిని గుంటూరు జిల్లా కేశానపల్లికి చెందిన శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. ఇంత భారీ ధర పలికిన ఆ గిత్తల జతను మీరూ చూడవచ్చు.

More Telugu News