: కువైట్ పార్లమెంటును రద్దు చేస్తూ వెలువడిన రాజాజ్ఞ

చమురు ధరలు పతనం అవుతుండటం, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో కువైట్ పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు రాజు షేక్ సాబా అల్ అహ్మద్ అల్ సాబా ప్రకటించారు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నేడు ప్రకటిస్తానని తెలిపారు. పార్లమెంట్ రద్దుతో పాత మంత్రివర్గం కూడా రాజీనామా చేయనుంది. కువైట్ లో ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వాలు గడువు వరకూ పాలించే పరిస్థితి చాలా అరుదు. 2013లో ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వం మూడేళ్లు నిండకుండానే రద్దు కావడం గమనార్హం. తన విశేషాధికారాలతో రాజాజ్ఞను వెలువరించడం ద్వారా అల్ అహ్మద్ పార్లమెంటును రద్దు చేశారు. త్వరలో ఎన్నికలు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తానని వెల్లడించారు.

More Telugu News