: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం...సిరీస్ లో ముందడుగు

తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ధోనీ కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ ను మార్టిన్ గుప్టిల్ (12) ను పాండ్యా అవుట్ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు నిలదొక్కుకోలేకపోయారు. మరో ఓపెనర్ లాథమ్ (79) క్రీజులో పాతుకుపోగా, వచ్చిన ఆటగాళ్లంతా వచ్చినట్టే పెవిలియన్ చేరారు. దీంతో కేవలం 65/7 ఉన్న దశలో లాథమ్ కు టిమ్ సౌథీ (55) జతకలిశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తరపున పదో నెంబర్ ఆటగాడిగా బ్యాటింగ్ కు దిగి అర్ధ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సౌతీ అవుట్ కావడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన లాథమ్ చివరివరకు నిలిచిన తొలి కివీస్ బ్యాట్స్ మన్ గా రికార్డుల్లో నిలిచాడు. అనంతరం 191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్ శర్మ (14), అజింక్యా రహానే (33) రాణించి 49 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ అవుట్ కావడంతో బ్యాటింగ్ కు వచ్చిన మనీష్ పాండే (17) నిలదొక్కుకునే పరిస్థితుల్లో నిష్క్రమించాడు. అనంతరం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(21) సమన్వయలోపం కారణంగా రనౌట్ అయ్యాడు. దీంతో కేదార్ జాదవ్ (10) సాయంతో టీమిండియాను కోహ్లీ (85) విజయతీరాలకు చేర్చాడు. దీంతో టీమిండియా 33.1 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ వన్డే ద్వారా అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా 3/31 తో రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

More Telugu News