: రెండేళ్ల ఉత్సవాలకు 36 కోట్లకు పైగా ఖర్చుచేసిన మోదీ ప్రభుత్వం

గతంలో ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకు, అవగాహనా కార్యక్రమాలకు మాత్రమే ప్రజాధనాన్ని ఖర్చుచేసేవి. తాజాగా ప్రచారానికి కూడా ప్రజాధనం భారీగా ఖర్చుచేస్తూ ప్రభుత్వాలు వార్తల్లో నిలుస్తున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగిసిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇండియా గేట్ వద్ద గత మే 29న సుమారు 6 గంటల పాటు కేంద్ర ప్రభుత్వం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాలను పేపర్లు, టీవీల్లో కవర్ చేసేందుకు 36 కోట్ల రూపాయలకు పైగా బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేసినట్టు తేలింది. ఐఏఎన్ వార్తా సంస్థ ఆర్టీఐ దరఖాస్తుతో ఈ సమాచారం రాబట్టింది. ఈ ప్రచారంలో ప్రింట్ మీడియాకు యాడ్స్ కోసం 35.59 కోట్ల రూపాయలు, ఎలక్ట్రానిక్ మీడియాకు 1.06 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, కళాకారులు, ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు ఎంత మొత్తం చెల్లించారన్న దానిపై సమాచారం లేదు. అయితే మీడియాకు ప్రచారం నిమిత్తం ఇంత పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చుచేయడం దుమారం రేపుతోంది.

More Telugu News