: తాజ్ మహల్ రంగు మారడం వెనుక కారణం ఇదే!

'ప్రేమ చిహ్నం' తాజ్‌ మహల్‌ రంగు మారడం వెనుక కారణాన్ని ఇండో-అమెరికన్‌ పరిశోధనా బృందం వెల్లడించింది. వాషింగ్టన్‌ లోని యూనివర్శిటీ ఆఫ్‌ మిన్నెసోటాకు చెందిన అజయ్‌, జార్జియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన రాజ్‌ లాల్‌ లు తాజ్ మహల్ రంగు మారడంపై గల కారణాలపై అధ్యయనం చేసి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రముఖ పర్యాటక కేంద్రం తాజ్‌ మహల్‌ పరిసర ప్రాంతాల్లో పిడకలు కాల్చడం, వ్యర్థ పదార్థాలను తగలబెట్టడం కారణంగా ఈ ప్రసిద్ధ కట్టడం రంగుమారుతోందని పేర్కొన్నారు. పిడకలు కాల్చడం కంటే వ్యర్థాలను తగలబెట్టడం వల్లే ఎక్కువ కాలుష్యం ఏర్పడుతోందని, ఈ కాలుష్యం కారణంగా తాజ్‌ మహల్‌ రంగు మారుతోందని వారు పేర్కొన్నారు. కాగా, తాజ్‌ మహల్‌ రంగు మారకుండా పర్యాటక శాఖాధికారులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. తాజ్ పరిసరాల్లోని పరిశ్రమలకు స్మోక్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేయటం, అలాగే తాజ్‌మహల్‌ వద్దకు వాహనాలను అనుమతించకపోవటం వంటి చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ తాజ్ రంగు మారుతుండడం విశేషం.

More Telugu News