: 200 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్న అటవీశాఖాధికారులు

పశ్చిమ బెంగాల్ లోని జల్‌ పాయ్‌ గురి జిల్లాలో ఐదు కంటెయినర్లలో 200 కోట్ల రూపాయల విలువైన పాము విషాన్ని అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెలకొబ రేంజ్ అటవీశాఖాధికారి సంజయ్ దత్తా వెల్లడించిన వివరాల ప్రకారం... ఫ్రాన్స్‌ లో సేకరించిన పాము విషాన్ని బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్ లోని సిలుగురికి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నిఘా ఉంచారు. ఐదు బుల్లెట్‌ ప్రూఫ్ కంటెయినర్లలో తరలిస్తున్న పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 200 కోట్ల రూపాయలు ఉంటుందని వారు వెల్లడించారు. పాము విషంతోపాటు మందుగుండు సామగ్రి, ఓ రివాల్వర్‌ కూడా పట్టుబడ్డట్టు వారు తెలిపారు. ఈ స్మగ్లింగ్ లో సుజయ్ కపూర్ దాస్, బిపుల్ సర్కార్, పింటు బెనర్జీ, అమల్ నుబియాలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పశ్చిమబెంగాల్ కు చెందిన అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా సభ్యులని వెల్లడించారు.

More Telugu News