: బెదిరిపోయిన అర్జంటీనా... కబడ్డీ వరల్డ్ కప్ పోటీల్లో భారత్ అతిపెద్ద విజయం

'కబడ్డీ... కబడ్డీ...' అంటూ భారత ఆటగాళ్లు కూతకు వస్తున్న వేళ, అర్జంటీనా జట్టు కకావికలమైంది. భారత ఆటగాళ్ల సత్తాకు ఏ దశలోనూ ఆ జట్టు ఎదురు నిలిచే ప్రయత్నం చేయకపోవడంతో, అహ్మదాబాద్ లో జరుగుతున్న కబడ్డీ ప్రపంచ కప్ పోటీల్లో భారత్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 74 - 20 పాయింట్ల తేడాతో గెలిచి సెమీస్ రేసుకు మరొక్క అడుగు దూరంలో నిలిచింది. సెమీస్ రేసులో ఉండాలంటే, తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో అజయ్ 14, రాహుల్ చౌదరి 11, సురేందర్ 7 పాయింట్లు తెచ్చారు. మరో మ్యాచ్ లో ఇరాన్ జట్టు ఉత్కంఠంగా సాగిన పోరులో 38 - 34 తేడాతో జపాన్ పై గెలిచి సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టు తన ఆఖరి మ్యాచ్ ని 18వ తేదీన ఇంగ్లండ్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే, మరే సమీకరణాలు లేకుండానే భారత జట్టు సెమీస్ కు చేరుతుంది. ఇదే సమయంలో నేడు కొరియాతో ఆడే ఇంగ్లండ్ ఓడిపోయినా, భారత్ సెమీస్ స్థానం ఖాయమవుతుంది.

More Telugu News