: భారత సర్జికల్ దాడులకు రష్యా మద్దతు... పాక్ కు ఆయుధాలు విక్రయించేది లేదన్న పుతిన్

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్న వేళ, మన సైన్యం సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి వెళ్లి సర్జికల్ దాడులు చేయడాన్ని రష్యా సమర్థించింది. బ్రిక్స్ సమావేశాలకు వచ్చిన రష్యా అధినేత పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన వేళ, పాకిస్థాన్ తో కలసి రష్యా సైనిక విన్యాసాలు చేయడాన్ని మోదీ ప్రస్తావించి, భారత ఆందోళనను తెలిపారని భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్ వెల్లడించారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ, ఇండియా ప్రయోజనాలకు విఘాతం కలిగించే పనులు తాము చేయబోమని హామీ ఇస్తూ, సర్జికల్ దాడులకు పూర్తి మద్దతిస్తున్నట్టు తెలిపారన్నారు. పాకిస్థాన్ కు ఆయుధాలను అమ్మే ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారని జై శంకర్ వివరించారు.

More Telugu News