: కశ్మీర్ సమస్యపై చర్చకు మేము రెడీ... మీరు రెడీయా?: భారత్ కు షరీఫ్ ప్రశ్న

భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రక్తత నెలకొనడానికి కశ్మీర్ సమస్యే కారణమని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి అన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని భారత్ కూడా భావిస్తే... భారత్ తో చర్చించడానికి పాక్ రెడీగా ఉందని తెలిపారు. కశ్మీర్ లో కొనసాగుతున్న హింసతో పాటు పలు అంశాలపై చర్చిద్దామని పాక్ పలుమార్లు ఆహ్వానం పంపినా భారత్ స్పందించలేదని షరీఫ్ ఆరోపించారు. ఉరీ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందన్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. ఎల్ఓసీ వద్ద పాక్ ఎలాంటి చొరబాట్లకు పాల్పడలేదని అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అజర్ బైజాన్ లో ఉన్న షరీఫ్... ఆ దేశ రాజధాని బాకూలో మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News