: చైనాకు వ్యతిరేకంగా గోవా ‘బ్రిక్స్ సదస్సు’ దగ్గర టిబెట్ విద్యార్థుల ధర్నా

గోవాలో జ‌రుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొన‌డానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భార‌త్ చేరుకున్న సంద‌ర్భంగా ఇండియాలో ఉన్న టిబెట్ పౌరులు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వారిలో విద్యార్థులు అధికంగా కనిపించారు. బ్రిక్స్ సదస్సు జ‌రుగుతోన్న‌ గోవా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆందోళ‌న‌కు దిగిన‌ వారు.. చైనా అధ్య‌క్షుడు త‌మ ప్రాంతంపై చూపిస్తోన్న‌ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టిబెట్‌కు స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తూ, ‘టిబెట్‌లో చైనా ఆక్ర‌మ‌ణ‌లు ఆపండి, టిబెట్‌కు స్వేచ్ఛ‌ను ఇవ్వండి’ అని నినాదాలు చేశారు. 'చైనా అవుట్ ఆఫ్ టిబెట్ నౌ' అని ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ఆందోళ‌న‌కు దిగిన‌ ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News