: ఇండియా, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఇవే...!

గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సమాఖ్య సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, పలు అంశాలపై చర్చించిన ఇద్దరు నేతలు... అనంతరం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రధానంగా ఎనర్జీ, డిఫెన్స్ కు సంబంధించిన ఒప్పందాలకు వీరు పెద్ద పీట వేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఇవే... 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీ ఏర్పాటుకు రవాణా వ్యవస్థకు సహకారం 2. ఆంధ్రప్రదేశ్ లో షిప్ బిల్డింగ్ 3. హర్యాణాలో స్మార్ట్ సిటీస్ 4. ఇరు దేశాల మధ్య గ్యాస్ పైన్ లైన్ ఏర్పాటుకు సంబంధించి సంయుక్త అధ్యయనం 5. రాస్ నెఫ్ట్, ఎస్సార్ మరియు ఓఎన్జీసీల మధ్య డీల్ 6. మౌలికవసతుల నిధి 7. రైల్వేలు 8. కామోవ్ కేఏ226 హెలికాప్టర్ల తయారీ 9. ఇస్రోకు సంబంధించిన ఒప్పందం 10. ద్వైపాక్షిక వ్యాపారంపై ఎంఓయూ 11. సైంటిఫిక్ డెవలప్ మెంట్ పై ఎంఓయూ 12. పెట్రోలియం ఎనర్జీ 13. అంతర్జాతీయ సమాచారం యొక్క రక్షణ 14. నాలుగు ఫ్రిగేట్ (వార్ షిప్)ల కొనుగోలు 15. కూడంకుళం అణుకేంద్రంలో మరో రెండు రియాక్టర్ల నిర్మాణం

More Telugu News