: 'సుష్మ'మ్మకు ట్వీట్ తో బుజ్జాయికి పండగొచ్చింది!

ఎవరైనా కష్టాల్లో ఉండి, వాటిని తీర్చాలంటా ఒక్క కోరిక కోరితే, తనకు చేతనైనంతలో సాయపడే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మరోసారి తన ఉదారతతో నెటిజన్లతో శభాషనిపించుకున్నారు. భారత సంతతి బిడ్డ తన తొలి దీపావళిని అమ్మమ్మ, తాతయ్యలతో జరుపుకునేందుకు ఆమె అనుమతించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇండియాకు చెందిన అతిది చందక్ భారత పౌరసత్వంపై ఆస్ట్రేలియాలో ఉంటుండగా, ఆమెకు ఓ చిన్నారి పాప పుట్టింది. ఆ పాపకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. ఇటీవల ఓ అర్జెంట్ పని నిమిత్తం ఆమె తన బిడ్డతో కలసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. చిన్నారి వీసా గడువు ముగియనుండటం, మరో రెండు వారాల్లో దీపావళి పండగ రానుండటంతో, పండగ ఇక్కడే జరుపుకోవాలని భావించిన అదితి, విషయాన్ని సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చిన్నారి వీసాను పొడిగిస్తున్నట్టు ప్రకటించిన సుష్మా, "రెండు నెలల చిన్నారి... తన తొలి దీపావళి. ఆ పాప తాత, అమ్మమ్మలతో జరుపుకుంటుంది. పాపకు నా శుభాకాంక్షలు చెప్పండి" అని ట్వీట్ చేశారు.

More Telugu News