: కొత్త జిల్లాలపై కేంద్రానికి తెలంగాణ నివేదిక.. 2016 బ్యాచ్ నుంచి భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ కేటాయింపులు జరపాలని విన్నపం

ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వం ప్రారంభించిన కొత్త జిల్లాలపై స‌మ‌గ్ర నివేదిక‌ను రాష్ట్ర‌ స‌ర్కారు కేంద్రానికి అందించింది. రాష్ట్రం త‌ర‌ఫున ఢిల్లీకి వెళ్లిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ శ‌ర్మ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప్ర‌క్రియ అంశాల‌తో హోం మంత్రిత్వ‌శాఖ‌కు ఆయ‌న నివేదిక ఇచ్చారు. కొత్త జిల్లాల‌కు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను త్వ‌ర‌గా కేటాయించాల‌ని ఆయ‌న కోరారు. 2016 బ్యాచ్ నుంచి భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్ కేటాయింపులు జ‌ర‌పాల‌ని ఆయ‌న కేంద్రాన్ని కోరారు. కొత్త జిల్లాల‌కు నిధులు అందించాల‌ని విన్న‌వించారు. 21 న‌వోద‌య‌, 21 కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాలు మంజూరు చేయాల‌ని కోరారు.

More Telugu News