: 50 హైదరాబాద్ ఐటీ కంపెనీలను హ్యాక్ చేసిన పాకిస్థాన్ హ్యాకర్లు.. హానికారక సాఫ్ట్‌వేర్లతో దాడి

హైదరాబాద్‌లోని 50 ఐటీ కంపెనీలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు గత పదిరోజుల్లో వీటిని హ్యాక్ చేసినట్టు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ), పోలీసులు గురువారం తెలిపారు. హానికారక సాఫ్ట్ వేర్, బిట్‌కాయిన్స్‌ను ఉపయోగించి హ్యాకర్లు ఈ పనికి పాల్పడినట్టు సైబారాబాద్ సెక్యూరిటీ ఫోరం అధికారులు తెలిపారు. టర్కీ, సోమాలియా, సౌదీ అరేబియాలోని సర్వర్ల ద్వారా పాకిస్థానీ హ్యాకర్లు ఈ పనికి పాల్పడినట్టు పేర్కొన్నారు. హ్యాకర్లలో కొందరిని గుర్తించామని, పాకిస్థాన్ కేంద్రంగా హానికారక సాఫ్ట్‌వేర్లతో ఐటీ కంపెనీలపై గత పది రోజులుగా దాడులు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ ఫోరం హెడ్ దేవ్‌రాజ్ వడయార్ తెలిపారు. భారత్ సర్జికల్ దాడులకు ప్రతీకారంగా 7వేలకు పైగా భారత వెబ్‌సైట్లను హ్యాక్ చేసినట్టు ఇటీవల పాకిస్థానీ హ్యాకర్ల గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌కు చెందిన 50 ఐటీ కంపెనీలు హ్యాక్‌కు గురైన విషయం తాజాగా బయటపడింది.

More Telugu News