: జపాన్ లో క్యాప్సుల్ హోటల్స్ కి డిమాండ్ పెరిగింది!

మెట్రో, రెట్రో నగరాల్లో అక్కడికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారంతా హోటళ్లలో బసచేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ సమస్యను దూరం చేసేందుకు జపాన్ లో క్యాప్సుల్ హౌసెస్ వెలిశాయి. ఇవి అచ్చం రైలు, స్లీపర్ బస్ కూపేల్లా ఉంటాయి. బెర్త్ సైజులో ప్రతి ఒక్కరికి ఒక గది ఉంటుంది. ఈ గది ఒకగదిపై ఒకటి, ఒకదాని ఎదురుగా ఒకటి ఇలా గదులు ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో టీవీ, ఇంటర్నెట్‌, అద్దం, అలారం క్లాక్స్‌ తదితర సౌకర్యాలు ఉన్నాయి. లగేజ్‌ పెట్టుకోవడానికి వీలుగా లాకర్‌ సదుపాయం ఉంటుంది. బాత్రూమ్‌ లు మాత్రం అందరూ కలిపి వాడుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో బస చేసేందుకు 2 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వీటికి జపాన్ లో మంచి డిమాండ్ ఉంటోంది. నిరుద్యోగులు, చిరుద్యోగులు, వ్యాపారులు వీటిల్లోనే బసచేస్తున్నారని ఈ హోటల్స్ యజమానులు చెబుతున్నారు. నెల ఒప్పందంతో వారు వీటిని అద్దెకు తీసుకుంటున్నారని సమాచారం.

More Telugu News