: నాగ చైతన్య గురించి వచ్చిన లేఖ చూసి పుత్రోత్సాహంతో షేర్ చేసిన నాగ్!

జేకే భారవి... పరిచయం అక్కర్లేని పేరు. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి ఎల్లకాలం నిలిచిపోయే చిత్రాలను తెరకెక్కించడం వెనుక రాఘవేంద్రరావు కష్టం ఎంతుందో, వాటికి కథను అందించేందుకు భారవీ అంతే కష్టపడ్డారు. అంతటి గొప్ప కథా రచయిత, నాగచైతన్యను ప్రశంసిస్తూ, నాగార్జునకు ఓ లేఖ రాయగా, దాన్ని చదివి పుత్రోత్సాహం పట్టలేక, తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భారవి రాసిన ఆ లేఖలో... నమస్తే నాగ్‌ గారు., ప్రేమమ్‌ చూశాను. చైతు చాలా బాగా తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ తను చేసిన అన్ని ఫిల్మ్స్ కన్నా ప్రేమమ్‌ లో అత్యద్భుతమైన పరిణతితో కూడిన నటనను గమనించాను. పరిపూర్ణ నటుడిగా ఈ ఫిల్మ్ తో ప్రూవ్ చేసుకున్నాడు. తాతగారి పక్కన... మీ పక్కన నిలబడే యోగ్యతను సంపాదించుకున్నాడు. చేయించుకునే వాడుంటే.. ఎంతైనా చేయగలను.. అని చాటాడు. ఏఎన్‌ఆర్‌..ఆ మహానటుడి వారసుడు మీరు. చైతు.. మీ వారసుడు. ఈ లిస్ట్ లోకి అఖిల్‌ కూడా చేరాలని ఈ విజయదశమి సందర్భంగా ఆశిస్తున్నాను. మీ పుత్రోత్సాహానికి జయహో. - జేకే భారవి. అని లేఖ రాయగా, దాన్ని నాగ్ అభిమానులతో పంచుకున్నాడు.

More Telugu News