: దీపా కర్మాకర్ బీఎండబ్ల్యూను వెనక్కి తీసుకోలేం: చాముండేశ్వరినాథ్

క్రీడా ప్రతిభను కొనియాడుతూ, అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో బహుమతిగా ఇచ్చిన లగ్జరీ కార్లను, చిన్న చిన్న కారణాల వల్ల తీసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు ఒలింపియన్లకు బీఎండబ్ల్యూ కార్లను స్పాన్సర్ చేసిన చాముండేశ్వరినాథ్ తెలిపారు. తన ఊరిలో రోడ్లు బాగాలేనందున ఈ కారును వెనక్కు తీసుకుని అందుకు ప్రతిగా తనకు డబ్బివ్వాలని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోరినట్టు వచ్చిన వార్తలనూ ఆయన ఖండించారు. కారును వెనక్కు తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసిన ఆయన, దీపా కర్మాకర్ కోసం త్రిపుర రాజధాని అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ ను పెట్టించే విషయమై సంస్థ ప్రతినిధులతో మాట్లాడానని చాముండేశ్వరీనాథ్ తెలిపారు. ఈ విషయంలో స్పష్టత వచ్చిన తరువాతనే కారును వెనక్కు తీసుకోవాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, దీపతో పాటు మరో ముగ్గురు ఒలింపిక్ పతక విజేతలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేతుల మీదుగా ఈ లగ్జరీ కార్లను ఇప్పించిన సంగతి తెలిసిందే.

More Telugu News