: గర్భిణి ప్రసవానికి సైనికుల సహకారం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఇద్దరు సైనికులు ఓ గర్భిణి ప్రసవానికి సహకరించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన సంఘటన సెంట్రల్ రోమ్ స్క్యేర్ లో జరిగింది. పియాజ్జాశాన్ బార్టోలోమియో ప్రాంగ‌ణం మీదుగా ఆసుప‌త్రికి ప్రసవం కోసం బరిన్ ఐస్ ల్యాండ్ లోని ఫ్రాటెల్లీ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళుతోన్న 33 ఏళ్ల కాంగో మహిళకు నొప్పులు మొదలయ్యాయి. ఒంట‌రిగా ఉన్న ఆ మ‌హిళ ఏం చేయాలో తెలియ‌క కేక‌లు వేసింది. అక్క‌డే ఉన్న సైనికులు ఆమె అరుపులు విని, ఆమె ప‌రిస్థితి అర్థం చేసుకున్నారు. ఆమెకు తక్షణ సహాయం చేశారు. అందులో భాగంగా ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మినిచ్చిన త‌రువాత బొడ్డు తాడును సైనికులు క‌త్తిరించారు. అనంత‌రం తల్లీశిశువుల‌ను వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఈ సంఘ‌ట‌న‌పై మీడియాతో స‌ద‌రు సైనికులు మాట్లాడుతూ ప్రసవం గురించి త‌మ‌కు అంత‌గా తెలియదని, అయితే నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న మ‌హిళ‌ను ఎలాగైనా రక్షించాలని తాము ఆమె ప్ర‌స‌వానికి స‌హ‌క‌రించామ‌ని చెప్పారు. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించేలోపు త‌మ‌కు తోచిన సాయం చేశామ‌ని పేర్కొన్నారు. ఆ మ‌హిళ భ‌ర్త మరో ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉన్న‌ట్లు, మ‌హిళ ఒంట‌రిగానే ఆసుప‌త్రికి బ‌య‌లుదేరిన‌ట్లు స‌మాచారం.

More Telugu News