: రిజర్వేషన్ల విషయమై దళితులు, మరాఠాల మధ్య తీవ్ర ఘర్షణ... పూణెలో టెన్షన్!

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, మహారాష్ట్రలోని పూణెలో మరాఠాలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు నేడు తీవ్ర రూపం దాల్చాయి. దళితులు, మరాఠా కార్యకర్తల మధ్య దాడులు జరుగగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని రద్దు చేయాలని, రిజర్వేషన్లు వద్దే వద్దని మరాఠా యువత ఉద్యమిస్తుండగా, పూణెలోని లాహేగాన్ ప్రాంతంలో ఈ గొడవలు జరిగాయని తెలుస్తోంది. లాహేగాన్ పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టిన మరాఠాలు నినాదాలతో హోరెత్తించారు. పరిస్థితి అదుపు తప్పుతుందన్న అంచనాతో, వెంటనే స్పందించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించి నిరసనకారులను చెదరగొట్టారు. మరాఠాలు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి ఐదు రోజులు కాగా, వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

More Telugu News