: అమెరికా అధ్యక్షుడు ఎవరైనా 100 రోజుల్లో మోదీని కలవాల్సిందే: సీఎస్ఐఎస్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీకాలం మరో 100 రోజుల్లో ముగియనుంది. ఈలోగానే కొత్త అధ్యక్షుడి ఎన్నికా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా, 100 రోజుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి భవిష్యత్ సంబంధాల మెరుగునకై చర్చలు జరపాల్సిందేనని, అమెరికన్ సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజ్క్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్) తన తాజా రిపోర్టు 'ఇండియా-యూఎస్ సెక్యూరిటీ కోఆపరేషన్'లో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య రక్షణ బంధుత్వం బలపడుతున్న ఈ రోజుల్లో కొత్త అధ్యక్షుడు, మోదీల మధ్య సాధ్యమైనంత త్వరగా సమావేశం జరగాల్సి వుందని పేర్కొంది. భారత రక్షణ అవసరాలకు కీలకమైన అడ్వాన్స్డ్ సెన్సింగ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ సాంకేతికతలను అమెరికా అందిస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు ఎంతో ముఖ్యమని తెలిపింది. తదుపరి ప్రభుత్వం భారత్ తో పాటు ఆస్ట్రేలియా, జపాన్ లతో సైతం కలసి పనిచేయాల్సి వుందని, పసిఫిక్, హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ దేశాల ప్రయోజనాలు కలగలిసి వున్నాయని పేర్కొంది. కొత్త అధ్యక్షుడు, భారత ప్రధాని తొలి 100 రోజుల్లో కలిసి చర్చలు జరిపితే, ద్వైపాక్షిక బంధం బలోపేతంపై బలమైన సంకేతాలు వెళ్తాయని సీఎస్ఐఎస్ వెల్లడించింది.

More Telugu News