: ఇక రైలెక్కితే రెండు నిమిషాల్లో సీటు దగ్గరకే ఫుడ్!

ఏదైనా రైలు ఓ స్టేషన్లో ఆగిన సమయంలో రైలు దిగి, రెస్టారెంట్ ను వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ క్యూలో నిలబడి, కావాల్సిన ఫుడ్ ను ఎంచుకుని, దానికి డబ్బులు కట్టి, రైలు కదులుతుందేమోనన్న ఆందోళనతో ఫుడ్ ప్యాక్ అయ్యేంత వరకూ నిలబడే శ్రమ ఇకపై తప్పనుంది. రైళ్లలో ఆహార సరఫరాపై సంస్కరణల్లో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న 'రెండు నిమిషాల్లో డెలివరీ' పథకం అమలు విజయవంతమైంది. ఆ రైల్వే స్టేషన్లో ఏఏ రెస్టారెంట్లు ఉన్నాయి? అక్కడ ఆ సమయంలో ఏం లభిస్తుందో ముందే స్మార్ట్ ఫోన్ లో చూసుకుని ఆర్డర్ ఇస్తే, కేవలం రెండు నిమిషాల్లో దాన్ని సీటు వద్దకు అందించేలా రైల్వే శాఖ కొత్త విధానాన్ని అమలు చేస్తుండగా, దీనిపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ స్టేషన్లలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని మరిన్ని స్టేషన్లకు విస్తరించాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించింది. క్వాలిటీ విషయంలో రైల్వే శాఖపై గతంలో వేలకొద్దీ ఫిర్యాదులు వస్తుండగా, దీన్ని అధిగమించేందుకు గత సంవత్సరం భారీ ఎత్తున నిధులను కేటాయించిన రైల్వే శాఖ, కేవలం స్టేషన్లలో ఉన్న రెస్టారెంట్ల నుంచే కాకుండా, బయటున్న హోటళ్ల నుంచి కూడా సరఫరాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

More Telugu News