: సచిన్ చేతుల మీదుగా అందుకున్న బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేస్తున్న ఒలింపిక్స్ విజేత

రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాన్ని సాధించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఊహించని నిర్ణయం తీసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అందుకున్న బహుమతి బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేయాలని నిర్ణయించుకుంది. ఆ కారును మెయింటెయిన్ చేసే శక్తి తనకు లేకపోవడంతోనే ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె నివసించే అగర్తల రోడ్లపై ఖరీదైన బీఎండబ్ల్యూ కారును తిప్పడం చాలా కష్టం. ఎందుకంటే, అక్కడి రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, ఎత్తుపల్లాలు కూడా ఎక్కువే. అలాంటి రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడిపితే పాడయ్యే అవకాశాలే ఎక్కువ. దీనికితోడు, అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేదట. ఈ కారణంగానే బహుమతిని తిరిగిచ్చేయాలనే నిర్ణయానికి దీపా వచ్చిందని ఆమె కోచ్ నంది తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాముండేశ్వరి నాథ్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. దీనికి చాముండేశ్వరి నాథ్ కూడా స్పందించారని... కారుని పంపితే, ఆ కారు ఖరీదుని దీపా అకౌంట్లో వేస్తానని తెలిపారని చెప్పారు. ఒలింపిక్ మెడల్ విన్నర్స్ అయిన పీవీ సింధు, దీపా కర్మాకర్, సాక్షి మాలిక్ లకు సచిన్ చేతుల మీదుగా చాముండేశ్వరి బీఎండబ్ల్యూ కార్లను బహూకరించిన సంగతి తెలిసిందే.

More Telugu News