: నీపై చర్యలు తీసుకుంటాం.. దేశం విడిచి వెళ్లవద్దు!: 'డాన్' జర్నలిస్టు ఆల్మయిడాకు హుకుం జారీ చేసిన పాక్ ప్రభుత్వం

పాకిస్థాన్ పౌర ప్రభుత్వానికి, సైనిక నాయకత్వానికి మధ్య అభిప్రాయల భేదాలు వచ్చాయంటూ ఈ నెల 6న 'డాన్' పత్రికలో జర్నలిస్టు సిరిల్ అల్మయిడా కథనం రాశారు. దీనిపై పాక్ ప్రభుత్వం, ఆర్మీ కన్నెర్రజేశాయి. దీంతో, ఆయనను దేశం వెడిచి వెళ్లొద్దంటూ హూకుం జారీ చేశారు. దీంతో అతని పేరును పాకిస్థాన్ అధికారులు 'ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్'లో చేర్చారు. ఈ జాబితాలో ఉన్నవారు దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. లేకుంటే దానిని నేరంగా పరిగణిస్తారు. దీంతో, పాక్ ప్రభుత్వం తనపై పరిమితులు విధించడంపై అల్మయిడా ట్విట్టర్‌లో స్పందించారు. ఇది విచారకరమైన పరిణామమని, తనకు దేశం విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశమే లేదని, ఇది తన సొంతగడ్డ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే తాను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదని ఆయన వాపోయారు.

More Telugu News