: హాఫ్ సెంచరీలతో అలరించిన గంభీర్, పుజారా

ఇండోర్ లో న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా భారీ ఆధిక్యత దిశగా సాగుతోంది. వికెట్ కోల్పోకుండా 18 పరుగులతో ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. దీంతో, భారత్ ఆధిక్యత 385 పరుగులకు చేరుకుంది. ఈ రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఓపెనర్ మురళీ విజయ్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో, నిన్న రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగిన గంభీర్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత పుజారా, గంభీర్ లు నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న వెంటనే, పటేల్ బౌలింగ్ లో గుప్టిల్ కు క్యాచ్ ఇచ్చి గంభీర్ పెవిలియన్ చేరాడు. అనంతరం పుజారా (50)కు కోహ్లీ (2) జతకలిశాడు.

More Telugu News