: అపోలో ఆస్పత్రిలో 21 రోజులుగా జయలలిత.. లండన్, ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న చికిత్స

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత‌కు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆస్పత్రిలో చేరి నేటికి 21 రోజులు అయింది. లండన్, ఎయిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తున్నారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దని, త్వరలోనే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఆమెను పరామర్శించిన పలువురు ప్రముఖులు కూడా ఇదే మాట చెబుతున్నారు. అయితే అభిమానులు మాత్రం ‘అమ్మ’ ఆరోగ్యంపై కలత చెందుతున్నారు. ఆమె కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. మరోవైపు విపక్షాలు మాత్రం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరడంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందని ఆరోపిస్తున్నారు. తాత్కాలిక సీఎంను నియమించి పాలనపై దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఏఐఏడీఎంకే నేతలు ఖండిస్తున్నారు. పరిపాలన సజావుగా సాగుతోందని, చౌకబారు ఆరోపణలు మానుకోవాలని చెబుతున్నారు.

More Telugu News