: తెలంగాణలో నేటి నుంచే కొత్త జిల్లాలు.. సోమవారం అర్ధరాత్రి తుది నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో నేటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. నేడు పలువురు మంత్రులు కొత్త జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. కాగా కొత్త జిల్లాల్లో విస్తీర్ణం పరంగా చూస్తే కొత్తగూడెం జిల్లా ప్రథమస్థానంలో ఉండగా హైదరాబాద్ చివరన ఉంది. జనాభాలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయంలో సిరిసిల్ల చివరి స్థానంలో ఉంది. ప్రస్తుతం 75 జిల్లాలతో ఉత్తరప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో ఉండగా 31 జిల్లాలతో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది.

More Telugu News