: నవంబర్ 24న భారత్ లోకి చొచ్చుకెళ్దాం.. సిద్ధంగా ఉండండి: ముస్లిం యువతకు పీవోకే మాజీ ప్రధాని పిలుపు

నవంబర్ 24న భారత్ లోకి చొచ్చుకెళ్దాం సిద్ధంగా ఉండాలని ఆక్రమిత కశ్మీర్ మాజీ ప్రధాని సర్దార్ అట్టిక్యూ అహ్మద్ ఖాన్ ముస్లిం యువతకు పిలుపునిచ్చారు. నవంబర్ 24న పీవోకే నుంచి భారత్ కశ్మీర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. భారత్-పాకిస్థాన్ మధ్యనున్న కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించి పూంచ్, మిర్పూర్ సరిహద్దుల ద్వారా భారత కశ్మీర్‌ లోకి ప్రవేశిస్తామని ఆయన ఆయన తెలిపారు. ఇలా ప్రవేశించేందుకు కశ్మీర్‌ లోని రాజకీయ పార్టీల మద్దతు కోరుతానని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌ లోని పరిస్థితిని ప్రపంచానికి తెలిపేందుకు నవంబర్ 24న భారీ ర్యాలీ నిర్వహించనున్నానని ఆయన చెప్పారు. ఈ ర్యాలీలో పాల్గొని, సరిహద్దు దాటేందుకు సిద్ధంగా ఉండాలని ముస్లిం యువతకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపును ఐఎస్ఐ వ్యూహంగా భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత భారత్ పై దాడులకు దిగుదామని భావించిన పాక్ ఆటలు ఇండియన్ ఆర్మీ సాగనివ్వడం లేదు. దీంతో పాలుపోని ఐఎస్ఐ ఇలాంటి కుట్ర ద్వారా ఉగ్రవాదులను భారత్ లోకి పంపాలని భావిస్తోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News