: కేసీఆర్ పై ముద్దుకృష్ణమ నాయుడు ప్రశంసల వర్షం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూ, మండిపడుతుండే టీడీపీ నేత, ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ హయాంలో మండలాల ఏర్పాటు విజయవంతమైందని, దానిని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణలో జిల్లాల విభజన చేపట్టామని కేసీఆర్ ఇటీవల పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ముద్దుకృష్ణమ నాయుడు, కేసీఆర్ ను ప్రశంసించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించింది కూడా ఎన్టీఆరేనని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పనిలో పనిగా, తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్న కేసీఆర్, తెలంగాణలో బీసీ హాస్టళ్లను ప్రారంభిస్తుండటం హర్షణీయమన్నారు. కాగా, నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలాల కమిటీలో తాను సభ్యుడినని, తొలుత ఆ విధానాన్ని తాను వ్యతిరేకించినప్పటికీ, మండలాల ఏర్పాటు విజయవంతమైందని సీఎం కేసీఆర్ నాటి విషయాలను ఇటీవల ప్రస్తావించారు. అదే కోణంలో, కొత్త జిల్లాల ఏర్పాటు మంచి ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

More Telugu News