: ట్రంప్ కథకిక శుభం కార్డే... న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

రిపబ్లికన్ల తరుఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడాలని భావించి, తన నోటి దురుసుతనం, గతంలో చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయిన ట్రంప్ కథ ముగుస్తోందంటూ 'న్యూయార్క్ టైమ్స్' సంచలన కథనాన్ని ప్రచురించింది. తన వ్యాఖ్యలపై ట్రంప్ క్షమాపణలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆయనకు ఓటేసే పరిస్థితి కనిపించడం లేదని, ఇదే సమయంలో బిల్ క్లింటన్ పై అత్యాచార ఆరోపణలను రాజకీయ ఎత్తుగా మాత్రమే ప్రజలు చూస్తున్నారని పేర్కొంది. ట్రంప్ శైలిపై ఇచ్చిన ఈ కథనంలో ప్రచారంలో ట్రంప్ వెనుకబడ్డారని, గెలిస్తే తానేం చేస్తానన్నది ఆయన స్పష్టంగా చెప్పలేకపోయారని అభిప్రాయపడింది. హిల్లరీ ప్రైవేటు ఈ-మెయిల్స్ వ్యవహారాన్ని మరోమారు ప్రస్తావించినా, ఆమెను ఇరుకున పెట్టలేకపోయారని చెబుతూ, సొంత పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటం పెద్ద దెబ్బని వ్యాఖ్యానించింది. ప్రజల నుంచి కొట్టించుకోవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలోనే ఓ అతిపెద్ద ఘట్టం నుంచి డొనాల్డ్ ట్రంప్ వెనక్కు వెళ్లనున్నారని, ఇదే సమయంలో అమెరికాలో ఓ మహిళ అతిపెద్ద గౌరవాన్ని పొందేందుకు వడివడిగా కదులుతున్నారని పేర్కొంది.

More Telugu News