: మసూద్ కు మద్దతుగా చైనా వ్యాఖ్యలు... భారత్ పై పరోక్ష విమర్శలు

కరుడుగట్టిన పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్ విషయంలో చైనా మరోసారి భారత్ కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. మసూద్ పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాలన్న తీర్మానాన్ని ఇప్పటికే అడ్డుకున్న చైనా... ఇప్పుడు భారత్ పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాద నిరోధం పేరుతో రాజకీయంగా లబ్ధి పొందేందుకు భారత్ యత్నిస్తోందంటూ విమర్శించింది. ఉగ్రవాద నిరోధం విషయంలో ద్వంద్వ వైఖరి ఉండరాదని... ఉగ్రవాదంపై పోరాటం పేరిట రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించరాదని చైనా విదేశాంగ శాఖ ఉపమంత్రి లీ బావోడాంగ్ ఈ రోజు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. గోవాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు గ్జీ జిన్ పింగ్ భారత పర్యటనకు వస్తున్న సమయంలో బావోడాంగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మసూద్ విషయంలో మన దేశ వైఖరిని పరోక్షంగా నిందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

More Telugu News