: జోరుగా సాగుతున్న బంగారం వ్యాపారం... దూసుకుపోతున్న జెమ్స్ అండ్ జ్యూయెలరీ షేర్లు

ఈ దసరా, దీపావళి సీజన్ లో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో స్టాక్ మార్కెట్లో జెమ్స్ అండ్ జ్యూయెలరీ కంపెనీల ఈక్విటీ వాటాలను సొంతం చేసుకునేందుకు ఇన్వెస్టర్లు పొటీ పడుతున్నారు. దీంతో ఆభరణాల రంగంలో ఉన్న కంపెనీల వాటాలు దూసుకెళ్లాయి. గీతాంజలీ జెమ్స్ సంస్థ వాటా విలువ 11 శాతం పెరుగగా, గోల్డియం ఇంటర్నేషనల్ లిమిటెడ్ 15 శాతం పెరిగింది. తారా జ్యూయెలరీ 9 శాతం, త్రిభువన్ దాస్ బీమ్ జీ జవేరీ లిమిటెడ్ 5 శాతం, పీసీ జ్యూయెలరీస్ 6 శాతం లాభపడ్డాయి. మిగతా సంస్థల వాటాల ధర కూడా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సంకేతాలు సైతం ట్రేడర్ల సెంటిమెంట్ ను పెంచుతున్నాయి. దీంతో దేశవాళీ మార్కెట్లో బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 175 పెరిగి రూ. 29,753కు (డిసెంబర్ 5 డెలివరీ) చేరింది. ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 422 పెరిగి రూ. 42,287కు చేరింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 10 పైసలు లాభపడి రూ. 66.58 వద్ద కొనసాగుతోంది.

More Telugu News