: 100కు పైగా దేశాలకు ఎగుమతి కానున్న మారుతి బాలెనో

ప్రీమియం హ్యాచ్ బ్యాక్ గా భారత మార్కెట్లో విడుదలై విజయవంతమైన బాలెనో మోడల్ ను సౌత్ ఆఫ్రికా, కరేబియన్ దీవులు సహా 100 దేశాలకు ఎగుమతి చేయాలని ఇండియాలో అత్యధికంగా కార్లను తయారుచేసి విక్రయిస్తున్న మారుతి సుజుకి నిర్ణయించింది. ఇప్పటికే దేశవాళీ మార్కెట్లో లక్షకు పైగా బాలెనో యూనిట్లు విక్రయం కాగా, సమీప భవిష్యత్తులో ఉరుగ్వే, బొలీవియా, కోస్టారికా, హోండురాస్, పనామా, పేరు, సౌతాఫ్రికా, ఇండోనేషియా, యూఏఈ, ఒమన్, కువైట్, లెబనాన్, ఖతార్, సౌదీ తదితర దేశాలకు ఎగుమతి చేయనున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే ఫ్రాన్స్, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, హంగేరీ, ఐస్ ల్యాండ్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, స్వీడన్, పోలాండ్, స్పెయిన్, చీలీ, ఇజ్రాయెల్, ఇంగ్లాండ్, నేపాల్, భూటాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు బాలెనోలు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకూ 38 వేల యూనిట్లను ఎగుమతి చేశామని వెల్లడించారు. కంపెనీ నిర్వహిస్తున్న మనేసర్ ప్లాంటులో బాలెనో వేరియంట్లు తయారవుతుండగా, ఈ కారు అభివృద్ధిపై సంస్థ రూ. 1,060 కోట్లను వెచ్చించింది. గత సంవత్సరం అక్టోబర్ 26న కారు భారత్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

More Telugu News