: నిక్కర్లు వదిలేసి ప్యాంటులు తొడిగిన దత్తాత్రేయ, కిషన్ రెడ్డి

హైదరాబాద్ లోని గోల్నాకలో ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు వైభవంగా ప్రారంభం కాగా, కొత్త డ్రస్ కోడ్ లో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత సంవత్సరం వరకూ ఆర్ఎస్ఎస్ డ్రస్ కోడ్ లో భాగంగా నిక్కర్లే వేసుకుని పరేడ్, ఉత్సవాలు జరుగగా, ఈ సంవత్సరం నుంచి డ్రస్ కోడ్ ప్యాంట్లలోకి మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు కొత్త డ్రస్ కోడ్ లో కనిపించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, తాను 1965 నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నానని గుర్తు చేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదని, దేశం కోసం ఏర్పడిన సంస్థని చెప్పిన ఆయన, పాకిస్థాన్ లేదా చైనాతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తే, అండగా నిలుస్తామని వెల్లడించారు. భారత్ ను విచ్ఛిన్నం చేసేందుకు పాక్ కుటిలయత్నాలు చేస్తోందని విమర్శించిన కిషన్ రెడ్డి, ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పాల్సి వుందన్నారు. దేశరక్షణకు ఆర్ఎస్ఎస్ ముందు నిలుస్తుందన్నారు.

More Telugu News