: అడ్రస్ లేని లెటర్‌ను డెలివరీ చేసిన పోస్ట్‌మ్యాన్.. చిన్న ఆధారంతో ఆ ఘనత సాధించి హీరో అయిన వైనం!

ఊరిపేరు, ఇంటి నంబరు స్పష్టంగా ఉన్న ఉత్తరాలే సరైన అడ్రస్‌లో డెలివరీ కాలేకపోతున్న ప్రస్తుత తరుణంలో అసలు అడ్రస్సే లేని ఓ లేఖను సరైన అడ్రస్‌లో అందించి శభాష్ అనిపించుకున్నాడో పోస్టల్ ఉద్యోగి. సోషల్ మీడియాలో హీరోగా మారిన ఆ పోస్టల్ ఉద్యోగి ఏం చేశాడో తెలుసా..? ఆగ్నేయ ఐర్లాండ్‌లోని వెక్స్‌ఫోర్డ్ కౌంటీకి చెందిన పోస్ట్‌మ్యాన్‌ బట్వాడాలో భాగంగా కొన్ని ఉత్తరాలను డెలివరీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన డెలివరీ చేయాల్సిన లేఖల్లో ఒకటి ఆయన దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దానిపై ఉండాల్సిన అడ్రస్ స్థానంలో చిన్న లైట్‌హౌస్ బొమ్మ గీసి ఉంది. దాని పక్కనే ‘ఇక్కడ డెలివరీ చేయండి అని రాసి ఉంది. లెటర్‌పై గీసిన లైట్‌హౌస్ ప్రపంచంలోని పురాతన లైట్‌‌హౌస్‌లలో ఒకటైన హూక్‌ లైట్‌హౌస్ అని గుర్తించిన పోస్టు‌మ్యాన్ దానిని గమ్యస్థానానికి చేర్చి శభాష్ అనిపించుకున్నాడు. ఈ లెటర్‌ను ఫొటో తీసిన పోస్ట్‌మ్యాన్ దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి దాని గురించి వివరించాడు. దీంతో సోషల్ మీడియాలో అతడు ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఆయన పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ తెగ పొగిడేస్తున్నారు.

More Telugu News