: అందమైన లైంగిక బానిసలపై కోరికతో ఉగ్రవాదుల్లో చేరుతున్న భారత యువత: పోలీసుల విచారణలో వెల్లడైన నిజం

భారత్ నుంచి ఎంతో మంది యువత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదంపై ఆసక్తిని పెంచుకుని అక్కడికి వెళ్లి ఉగ్రవాదుల్లో చేరుతుండటానికి కారణాలపై విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. మహారాష్ట్రలోని పర్బనీ ప్రాంతానికి చెందిన యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తే, అందమైన లైంగిక బానిసలపై ఆసక్తితో ఉగ్రవాదుల్లో చేరేందుకు ఆసక్తిని కనబరిచినట్టు వెల్లడైంది. 31 సంవత్సరాల నాసిర్ అలియార్ ఖాదిర్ బిల్ అబూ బకర్ యఫాయ్ చౌసాను ఈ సంవత్సరం జూలై 14న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతనిపై పోలీసులు 3,632 పేజీల చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఐఎస్ఐఎస్ లోకల్ మాడ్యూల్ కు చీఫ్ గా ఉన్న నాసిర్, లైంగిక బానిసల కోసం ఆన్ లైన్లో సెర్చ్ చేస్తున్న వేళ, ఓ ఉగ్రవాదికి పరిచయమై, ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితుడైనవాడేనని పోలీసులు వెల్లడించారు. ఫేస్ బుక్ చాటింగ్, సెల్ ఫోన్ల ద్వారా, నాసిర్ సెక్స్ స్లేవ్స్ కోసం ప్రశ్నించాడని, పలు ఈ-మెయిల్స్ ద్వారా వీరి మధ్య సంభాషణలు జరిగాయని తెలిపారు. అమ్మాయిలు ఎలా ఉంటారు? వారి వయసు ఎంత? ఎక్కడి వారు? అందంగా ఉంటారా? ఉగ్రవాదుల్లో చేరితే, ఎంత మంది అమ్మాయిలను ఇస్తారు? వంటి ప్రశ్నలను నాసిర్ సంధించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇండియాలో అందమైన అమ్మాయిల పట్ల ఆసక్తిని చూపించే యువకులను త్వరగా బుట్టలో వేసుకోవచ్చని ఉగ్రవాద రిక్రూటర్లు గట్టిగా నమ్ముతున్నారని, వీరికి ఎరగా తాము బంధించిన యాజిడి యువతులను చూపిస్తున్నారని వివరించారు.

More Telugu News