: 'భారత్‌ది ఆధిపత్య ధోరణి' అంటూ పాక్ విమర్శలు.. మోదీ ఉన్నంత వరకు ఇంతేనని అక్కసు

ఉరీ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు నేరుగా ప్రధాని మోదీని విమర్శించని పాక్ ఇప్పుడు తన పంథా మార్చినట్టు కనిపిస్తోంది. మోదీ సర్కారుపై విరుచుకుపడింది. తీవ్ర ఆరోపణలు చేసింది. మోదీ అధికారంలో ఉన్నంత వరకు భారత్‌తో తమ సంబంధాలు మెరుగుపడే ఆశ కనిపించడం లేదంటూ ఆక్రోశం వెళ్లగక్కింది. భారత్ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందంటూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ కు విదేశీ వ్యవహారాల సలహాదారైన సర్తాజ్ అజీజ్ ఆరోపించారు. ఆసియాలో భారత్ ఆధిపత్య ధోరణిని పాక్ విభేదిస్తుందని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు భారత్‌తో తమ సంబంధాలు మెరుగుపడతాయన్న ఆశ తమకు లేదన్నారు. పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దులను మూసివేయాలన్న భారత్ నిర్ణయంతో తమకు ఎటువంటి నష్టం ఉండదని సర్తాజ్ పేర్కొన్నారు.

More Telugu News