: కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికే రోహిత్ దళితుడు కాదని నివేదిక ఇచ్చారు: చాడ

హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ రోహిత్ వేముల కులంపై రూపాన్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, హేచ్సీయూ వీసీ అప్పారావులను ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుల నుంచి తప్పించేందుకే ఈ నివేదికను ఇచ్చినట్లుగా ఉందని ఆరోపించారు. రోహిత్ వేముల దళితుడేనంటూ గుంటూరు కలెక్టర్, జాతీయ ఎస్సీ కమిషన్ తేల్చి చెప్పిన నేపథ్యంలో రూపాన్వాల్ కమిషన్ అతను దళితుడు కాదని ఎలా చెప్పగలిగిందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విధానం సరికాదని ఆయన స్పష్టం చేశారు. కమిషన్ల నివేదికలతో వాస్తవాలు కప్పిపుచ్చజాలరని ఆయన హెచ్చరించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావు, బీజేపీ పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. రోహిత్ వేముల దళితుడని, ఆయన ఆత్మహత్యకు దారితీసిన కారణాలున్నప్పటికీ, నివేదికల పేరుతో ఈ కేసును పక్కదోవ పట్టిస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు.

More Telugu News