: హైద‌రాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఈరోజు వ‌ర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ఎస్సార్ న‌గ‌ర్‌, యూస‌ఫ్‌గూడ‌ ప్రాంతాల్లో ఓ మోస్త‌రు వర్షం కురిసింది. సికింద్రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. అడ్డ‌గుట్ట, మారేడు ప‌ల్లి, చిల‌క‌ల‌గూడ, పార్శిగుట్ట‌, బేగంపేట, బోయిన్‌ప‌ల్లి, మోండా మార్కెట్లో భారీ వ‌ర్షం ప‌డింది. మ‌రోవైపు బ‌తుక‌మ్మ వేడుక‌లు జ‌రుగుతోన్న‌ ఎల్బీస్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ చినుకులు ప‌డ్డాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై చురుగ్గా కొన‌సాగుతున్న ఉపరిత‌ల ఆవ‌ర్త‌నం 5.8 కి.మీ. ఎత్తువ‌ర‌కు ఆవ‌రించి ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నేడు, రేపు తెలంగాణ, కోస్తాంధ్ర‌ల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెప్పారు. రాయ‌ల‌సీమ‌లో కొన్ని చోట్ల తేలిక‌పాటి వ‌ర్షాలు కురుస్తాయ‌ని చెప్పారు.

More Telugu News