: అమెరికాను వణికిస్తున్న మాథ్యూ హరికేన్.. ఏ క్షణమైనా తీరం తాకే అవకాశం ఉందని హెచ్చరిక

అమెరికాకు మాథ్యూ హరికేన్ ముప్పు పొంచి ఉంది. తుపాను ఏ క్షణమైనా తీరం తాకే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో గంటకు 192 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ, ఉత్తర కరోలినాపై తుపాను పెను ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే పది లక్షల వరకు ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. తుపాను ముప్పు నేపథ్యంలో డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్, సీ వరల్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలను మూసివేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వచ్చే మూడు రోజులు అధికారులు చేసే ప్రకటనను జాగ్రత్తగా వినాలని ప్రజలను కోరారు.

More Telugu News