: పాక్ కోడలికి లైన్ క్లియర్ చేస్తా... ట్వీట్ ద్వారా సుష్మా సమాధానం

రాజస్థాన్ లోని జోథ్ పూర్ కు చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుడు నరేశ్ తేవానీ కి పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ఎంబీఏ పట్టభద్రురాలు ప్రియా బచ్చానితో నవంబర్ 7న జోథ్ పూర్ లో వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజా ఘటనలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తావీయగా; ప్రియ, ఆమె కుటుంబ సభ్యులు భారత్ కు వచ్చేందుకు వీసా మంజూరు కాలేదు. దీంతో నరేష్, ఆయన తండ్రి కన్నయ్య లాల్ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను సహాయం చేయాలని కోరారు. కనీసం పెళ్లి కుమార్తె, ఆమె కుటుంబ సభ్యులకు వీసా మంజూరు చేసినా, తమ వివాహం జరుగుతుందని సూచించారు. దీనికి స్పందించిన సుష్మా స్వరాజ్ భారతీయ కోడలు ప్రియ (పాకిస్థానీ)కి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ కూడా చేశారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

More Telugu News