: అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని బహిరంగగా విక్రయిస్తున్న చైనా

అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని చైనాలో బహిరంగంగా విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఏనుగులు, ఇతర పెద్ద జంతువులకు మత్తుమందుగా వినియోగించే కార్ఫెంటానిల్‌ ను చైనాలో బహిరంగ మార్కెట్ లో విచ్చలవిడిగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కార్ఫెంటానిల్ ను 1970లో తొలిసారి అభివృద్ధి చేశారు. అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ ఓపియోఇడ్‌ ను కార్ఫెంటానిల్‌ గా పిలుస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. దీనిని దిగుమతి చేసుకుంటున్న డీలర్లు దానిని ఫెంటానిల్, హెరాయిన్‌ గా విడగొట్టి సొమ్ముచేసుకుంటున్నారు. గసగసాల కంటే చిన్న పరిమాణంలో ఉండే కార్ఫెంటానిల్ ను ఉపయోగించి ఓ మనిషిని చంపేయవచ్చు. కార్ఫెంటానిల్ ఇక ఫెంటానిల్ అయితే హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తిమంతమైనది. కార్ఫెంటానిల్ ఫెంటానిల్ కంటే వంద రెట్లు శక్తిమంతమైనది. ఇంత ప్రమాదకరమైన ఈ రసాయనాన్ని చైనాకు చెందిన 12 కంపెనీలు అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నాయి. కిలో రసాయనం కేవలం 2.74 డాలర్లు (2.2 పౌండ్లు) కావడం విశేషం. ఈ డ్రగ్ బారిన పడిన వేలాది మంది అమెరికన్లు మరణించగా, దీనిని నిషేధించాలని ఆ దేశం డిమాండ్ చేస్తోంది. ఇది ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే పెను ప్రమాదం ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, హాట్స్ సేల్స్‌ కు కారణమవుతున్న ఈ రసాయనాన్ని విక్రయించడం ఆపేది లేదని విక్రేతలు స్పష్టం చేశారు. కాగా, ఇటీవల చైనా నుంచి ఎగుమతైన కేజీ కార్ఫెంటానిల్‌ ను కెనడా సీజ్ చేసింది.

More Telugu News