: భారత్ లాంటి లౌకిక దేశంలో ట్రిపుల్ తలాఖ్ కు తావులేదు: ‘సుప్రీం’తో కేంద్రం

ఇస్లాం చట్టం ప్రకారం పురుషులు ‘తలాక్’ అని మూడు సార్లు అంటే తమ భార్యల నుంచి విడాకులు తీసేసుకున్నట్లే. వివక్ష చూపుతున్న ఇలాంటి చట్టాలను ముస్లిం మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే ముస్లిం మత పెద్దలు పెళ్లి, విడాకులు, వారసత్వం లాంటి విషయాల్లో తమ సొంత సివిల్ కోడ్ ను పాటిస్తున్నారు. వారి కుటుంబ విషయాల్లో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకోగలవనే విషయమై సుప్రీంకోర్టు వివరణ కోరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్ లాంటి లౌకిక దేశంలో ట్రిపుల్ తలాక్ కు ఆస్కారం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లింగ సమానత్వం, గౌరవం విషయంలో మహిళలు ఏమాత్రం తక్కువ కాదని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో పేర్కొంది.

More Telugu News