: పౌరసరఫరాల హమాలీలకు ‘చంద్రన్న దసరా కానుక’తో పాటు మరో శుభవార్త

ఏపీలో పౌరసరఫరాల గోదాముల్లో పని చేసే హమాలీలకు ‘చంద్రన్న దసరా కానుక’ అందనుంది. ఈ కానుకను 4,800 మంది హమాలీలు అందుకుంటారని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దసరా కానుక కింద రూ.3 వేలు, 2 జతల బట్టలు, కిలో స్వీట్ ప్యాకెట్ ఇస్తున్నామని, ‘చంద్రన్న కానుక’ కింద ప్రభుత్వం రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని సునీత పేర్కొన్నారు. హమాలీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కాగా, పౌరసరఫరాల గోదాముల్లో పనిచేసే హమాలీలకు మరో శుభవార్త కూడా ఆమె ప్రకటించారు. ఈ గోదాముల్లో పనిచేసే హమాలీలకు హాండ్లింగ్ ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించారు. హాండ్లింగ్ ఛార్జీలు క్వింటాకు రూ.12 నుంచి రూ.15 కు పెంచామని, ఈ పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.9.53 కోట్ల భారం పడుతుందని సునీత పేర్కొన్నారు.

More Telugu News