: తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించే యోచనలో టీఎన్ ఇన్ ఛార్జ్ గవర్నర్

17 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తోందన్న వార్తలు వస్తున్నాయే కానీ... లోపల ఏం జరుగుతోందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. జయకు ట్రీట్ మెంట్ జరుగుతున్న గదిలోకి ఎవరినీ అనుమతించడం కూడా లేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా జయను చూడకుండానే ఆసుపత్రి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఈ సాయంత్రంలోగా తమిళనాడు ప్రభుత్వంలో కీలక మార్పు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రానికి తాత్కాలిక ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసే దిశగా ఏఐఏడీఎంకే అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలను గవర్నర్ కు వివరించారు. ఈ క్రమంలో, జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రికి కాసేపట్లో విద్యాసాగర్ రావు వెళుతున్నారు. అక్కడే రాష్ట్ర మంత్రులతో గవర్నర్ భేటీ అయి చర్చలు జరుపుతారు. ఈ సమావేశం అనంతరం కీలకమైన నిర్ణయం వెలువడనుంది.

More Telugu News