: మోదీ మనపై దాడులకు దిగడానికి కారకుడవు!: నవాజ్ షరీఫ్ పై నిప్పులు చెరిగిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై తెహ్రీక్-ఎ-ఇన్షాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఎల్ఓసీ వెంబడి ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ కు దిగినట్టు భారత్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో నవాజ్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. పాక్‌ సరిహద్దు వెంట దాడులు జరిపామని భారత్‌ చెప్పుకొస్తుంటే. అది వాస్తవం కాదు అని చెప్పేందుకు షరీఫ్‌ ఒక్క ఆధారం కూడా చూపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ కు వెళ్లిన నవాజ్ షరీఫ్ అక్కడి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో తేనీటి విందులో పాల్గొని... మోదీ ప్రభుత్వం దాడులకు దిగేంత చొరవ తీసుకోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. షరీఫ్‌ సానుకూల సంకేతాలే ఎల్ఓసీ వెంబడి ఇండియన్ ఆర్మీ దాడికి దోహదం చేశాయని ఆయన విమర్శించారు. భారత్ అంతర్జాతీయ దౌత్యంతో పాకిస్థాన్ ను ఏకాకిని చేయాలని చూస్తుంటే నవాజ్ షరీఫ్ దానిని అడ్డుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి కారణంగా పనామా పేపర్స్ జాబితాలో చోటుసంపాదించిన నవాజ్ షరీఫ్‌ విదేశాల్లో షాపింగ్ కు పాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బచ్చాఖాన్‌ యూనివర్సిటీలో 19 మంది విద్యార్థుల మరణానికి నవాజ్ షరీఫ్ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు.

More Telugu News