: పాట్నా హైకోర్టులో చుక్కెదురైన వేళ, నితీష్ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట

బీహార్ లో మద్య నిషేధం చెల్లదని పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం స్టే విధించింది. మద్యాన్ని నిషేధించాలా? విక్రయించాలా? అన్న విషయంలో ప్రభుత్వానిదే నిర్ణయమని అభిప్రాయపడింది. దీంతో నితీశ్ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. కాగా, రాష్ట్రంలో అమలవుతున్న మద్య నిషేధాన్ని తొలగిస్తూ, సెప్టెంబర్ 30న పాట్నా హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై నితీశ్ సర్కారు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది.

More Telugu News